సెర్బియా దేశంలో కాల్పుల కలకలం రేగింది. ఒక దుండగుడు కారులోంచి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బెల్గ్రేడ్కు దక్షిణంగా కారులో ప్రయాణిస్తూ మూడు గ్రామాల పరిధిలో ఆటోమేటెడ్ గన్తో అతను ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.