గుండెపోటుతో ఉపాధిహామీ కూలీ మేదర ఏసయ్య (64) శుక్రవారం దాచేపల్లి మండలం కొత్తూరులో మృతి చెందాడు. ఏసయ్య పంట పొలాల్లో కాల్వలో మట్టిపనులు చేస్తుండగా గుండెనొప్పి అని కాల్వగట్టుపై కూలబడి తుదిశ్వాస విడిచాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఉపాధిహామీ ఏపీవో మల్లికార్జునరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా సహాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.