సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే ట్రిపుల్ ఐటీ విద్యార్థినీవిద్యార్థుల బకాయిలు చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీల్లోని విద్యార్థినీవిద్యార్థులకు ఒక్కొక్కరికి జగన్ ప్రభుత్వం 47,500లు చెల్లించాలన్నారు. బకాయిల కోసం విద్యాసంస్థల డైరెక్టర్లు విద్యార్థుల్ని హింసిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విద్యార్థులను ఫీజుల కోసం వేధించే విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న ముఖ్యమంత్రి... ట్రిపుల్ ఐటీ యాజమాన్యాల వేధింపులపై ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు.