బాలికను నడిరోడ్డుపైనే దారుణంగా కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. సోను అనే యువకుడు తన ప్రేయసితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా చిన్న గొడవ అయింది. దీంతో ఆగ్రహించిన సోను ప్రేయసిపై దాడి చేశాడు. కంటి వద్ద రక్తం వచ్చేలా కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. వీధిలో రక్తపు గాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.