భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో GSLV ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా IRNSS-1J (నావిక్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇప్పటికే రాకెట్ మొదటి అనుసంధాన పనుల్లో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరులో ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.