శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో సర్పంచ్ మీనుగ నాగరాజు శనివారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి స్పందన లభించింది. 180 మంది కంటిపరీక్షలు చేయించుకోగా, వారిలో 15 మంది శస్త్రచికిత్సలకు ఎంపికైనట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబిరెడ్డి, జయచంద్రారెడ్డి, నాగమ్మ పాల్గొన్నారు.