గుడివాడ పట్టణంలోని 8, 10, 11 వార్డు సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ వి. మురళీకృష్ణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. సంక్షేమ పథకాలకు సంబంధిం చి నిలిచిపోయిన దరఖాస్తులను చూశారు. తక్షణ పరిష్కారానికి కావలసిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏమైనా సమస్యలు పెం డింగ్ లో ఉంటే వాటిని తమ దృష్టికి తెస్తే ఉన్నత అధికారులతో పరిష్కార దిశగా ప్రయ త్నిస్తామన్నారు. ఉద్యోగులు నిబంధనలు పాటించకున్నా, సకాలంలో స్పందించకున్నా పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 'జగ నన్నకి చెప్పుకుందాం' కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు.