ఈనెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నికలపై సీ-ఓటరు చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 122 స్థానాల్లో విజయం సాధించవచ్చని ఆ సర్వే పేర్కొంది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 స్థానాలు గెలుచుకోవాలి. ఈసారి కాంగ్రెస్‌కు 40.2 శాతం ఓట్లు రావచ్చని సర్వే తెలిపింది. ఇక బీజేపీ 73 నుంచి 85 సీట్లలో గెలిచే అవకాశం ఉందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa