ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె గ్రామ సమీపంలో జరుగుతున్న జగనన్న కాలనీని బీజేపీ నియోజకవర్గ కన్వీనరు గొర్రె శ్రీనివాసులు నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో బేస్ మట్టాలన్నీ పాడయ్యాయని, ఇళ్ల నిర్మాణం కూడా నాశిరకంగా జరుగుతున్నాయన్నారు. జగనన్నకాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని, అయితే ప్రభుత్వం సూచించిన స్టాండర్డ్ ప్రకారం ఒక్క ఇల్లు కూడా నిర్మాణం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, రాజుపాలెం మండల అధ్యక్షుడు రామసుబ్బయ్య, ప్రొద్దుటూరు రూరల్ మండల ఉపాధ్యక్షుడు ఇటుకల ప్రకాష్, కార్యదర్శి సంజీవ, గొర్రె క్రిష్ణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్, వార్డు ఇన్చార్జి సుబ్బయ్య, గంగాధరెడ్డి, మురళి, హరిబాబు, పెద్దసుబ్బయ్య పాల్గొన్నారు.