తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన మౌలా వెల్డర్ గా పని చేసేవాడు. గాలివీడు మండలం అరవీడులో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం ఓ షెడ్డుకు రేకులు అమర్చడానికి వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీంతో పై నుంచి కింద పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa