గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీ సచివాలయం పరిధిలోని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయనందారెడ్డి గడపగడపలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పూర్ణచంద్రారెడ్డి , సర్పంచ్ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.