కడప కలెక్టరేట్ లోని స్పందన హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజల నుంచి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు స్వీకరించారు. కడప జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజుతో పాటు అర్జీలను జాయింట్ కలెక్టర్ జి. గణేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్వో గంగాధర్ గౌడ్, డ్వామ, డిఆర్డీఏ పీడిలు యదుభూషన్ రెడ్డి, ఆనంద్ నాయక్ లు పాల్గొన్నారు.