ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేత్రపర్వంగా ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అష్టబంధన సంప్రోక్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 04:43 PM

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం చిట్యాల గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగా జరుగుతున్నాయి. నేటి సోమవారం ఉదయం అష్టబంధన సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన మహా పూర్ణాహుతి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, వారి సతీమణి విమలభాను, శ్రీశ్రీశ్రీ హంపి పీఠాధిపతులు, మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఆలయ నిర్మాణ ధర్మకర్త మారెళ్ళ పుల్లారెడ్డి, వారి సోదరులు, ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డి, మారెళ్ళ అమ్మిరెడ్డి సత్యనారాయణరెడ్డి స్మారక ట్రస్ట్ చైర్మన్ మారెళ్ళ విజయ నరసింహారెడ్డి, పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa