ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సోమవారం డిమాండ్ చేశారు. చిలకలూరిపేట టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు , ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఉంది వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది మొదలు ఇప్పటివరకు రైతులకు జరిగిన పంట నష్టపరిహారాలు అందించకపోగా కనీసం పంట నష్టపరిహారం అంచనాలు కూడా తయారు చేయకపోవడం శోచనీయం. ఇప్పుడు కురిసిన అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న తడిచిపోయి ఉన్న వాటిని కొనాలంటే వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు అలానే కళ్ళల్లో ఉన్న మిర్చి కూడా తడిచిపోయి 20వేల రూపాయలు ధర పలికే మిర్చి ఇప్పుడు 8000/- నుండి 10, 000/- రూపాయలన్నా కొనే నాధుడు లేకుండా పోయాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బికే కేంద్రాల ద్వారా ఒక్క క్వింటాలు కూడా పంట రైతుల వద్ద కొనుగోలు చేయకపోగా వారికి ఎలాంటి నష్టపరిహారం కూడా అందజేయలేదు రైతు భరోసా కేంద్రాలు వారి ప్రచార ఆర్బాట కేంద్రాలుగా తయారయ్యాయి తప్ప రైతులకు వాటి ద్వారా ఎలాంటి మేలు చేకూరడం లేదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొనివాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa