ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతును దుషించలేదు: మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 09:06 PM

నిన్న రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చానని ఏపీ పౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారని వారు తనతో చెప్పుకున్నారని, ఏ మిల్లరు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని రైతులకు చెప్పానని వివరించారు. తన ఫోన్ నెంబరు కూడా ఇస్తున్నానని, ఏ మిల్లు వాళ్లయినా రైతుల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా ఆ మిల్లును బ్లాక్ చేస్తామని రైతులకు చెప్పానని తెలిపారు. మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండం వేల్పూరులో పర్యటించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఓ రైతుపై మండిపడ్డారని, తిట్టారని కథనాలు వచ్చాయి. దీనిపై మంత్రి కారుమూరి వివరణ ఇచ్చారు. తాను ఆ రైతును దూషించలేదని స్పష్టం చేశారు. 


"నేను ఈ విధంగా రైతులతో మాట్లాడుతుంటే ఓ వ్యక్తి బాగా తాగి వచ్చాడు. నా పంట మొలకొచ్చింది, నా పంట మొలిచేసిందండీ అని ఏదేదో చెబుతున్నాడు. ధాన్యం ఎలా ఉన్నా కొంటాం అని అతడకి చెప్పాను. అప్పుడు అతను అగ్రిగోల్డ్ ఏంటండీ అన్నాడు. దాంతో అతడిని ఉద్దేశించి ఎర్రి పప్ప అని అన్నాను. ఎర్రి పప్ప అంటే నా బుజ్జినాన్న అని అర్థం" అని మంత్రి కారుమూరి వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com