‘చాట్‌జీపీటీ’ దుర్వినియోగం చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చైనాలోని వాయవ్య గాన్సు ప్రావిన్స్‌లో చోటుచేసకుంది. వివరాల ప్రకారం.. రైలు ప్రమాదానికి గురై 9మంది చనిపోయారని తప్పుడు వార్తను సృష్టించి, ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తిని చైనా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుడు హాంగ్ అనే మారుపేరుతో చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. అయితే తప్పుడు వార్త నిజమని కొన్ని పత్రికలు ప్రచురించాయి.