నలుగురు స్నేహితులు కలిసి ఈత కోసం కృష్ణా నదికి వెళ్లగా వారిలో ఇద్దరు గల్లంతైన ఘటన పెనమలూరు మండలం యనమలకుదరులో సోమవారం రాత్రి జరిగింది. యనమలకుదురు గ్రామానికి చెందిన రత్న రాకేష్, జాన్ బన్యన్, జీవన్‌బాబు, రాజ్‌కమల్ వేర్వేరు వీధుల్లో ఉంటున్నారు. ఈ నలుగురూ మంచి స్నేహితులు. అంతా పదో తరగతి విద్యార్థులే. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో నలుగురూ ఉత్తీర్ణులయ్యారు. ఆ రోజు నుంచి మరింత సంతోషంగా తిరుగుతున్నారు. సోమవారం ఉదయం ఈ నలుగురు కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. వారిలో రత్నరాకేష్, జాన్ బన్యన్ నీటిలోకి దిగి కనిపించలేదు. దింతో జీవన్‌బాబు, రాజ్‌కమల్ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు