మే 14వ తేదీ నుంచి బెల్లంకొండ మండలంలోని కోళ్లూరు శ్రీ ఆంజనేయస్వామి 63వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు దంపతులు ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో పాల్గొని వార్షికోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.