శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల చిన్నారిపై కొమరల్తాడ గ్రామానికి చెందిన కొంకి పవన్ సోమవారం అసభ్యకరంగా ప్రవ ర్తించాడు. పోలీసులు, బాధిత బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పవన్ ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఆ సమీపంలో ఉన్న చిన్నారి సోమవారం ఆడుకుంటూ బంకు వద్దకు వచ్చింది. అతను ఐస్‌క్రీం తెమ్మని చిన్నారికి రూ.20 ఇచ్చాడు. దీంతో బాలిక సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి ఐస్‌క్రీం తెచ్చి ఇవ్వగా ఇద్దరూ తిన్నారు. మళ్లీ మధ్యాహ్నం కూడా చిన్నారిని పిలిచి కూల్ డ్రింక్‌లు తెమ్మని చెప్పి రూ.40 ఇచ్చాడు. ఆ డబ్బులతో తెచ్చిన కూల్ డ్రింక్ తాగుదామని బాత్రూం వద్దకు తీసుకువెళ్లి బాలికపై పవన్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిన్నారి ఏడ్చుకుంటూ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. చిన్నారిని వైద్యసేవల కోసం పలాస ప్రభుత్వా సుపత్రికి తరలించారు. పవన్‌పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు.