శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రభుత్వం సరఫరా చేసే శుద్ధ జలాల ధరను పెంచారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజలధార పథకం కింద రూ.2కే 20 లీటర్ల నీరు సరఫరా చేసేది. దీంతో ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఈ నీటినే తాగేందుకు వినియోగించే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని వైఎ్‌సఆర్ సుజల స్రవంతిగా మార్చేసింది. నిర్వహణలో వైఫల్యం చెంది శుద్ధజలాలను ప్రజలకు సక్రమంగా అందించలేక పోయింది. ఇప్పుడు ఈ నీటి ధరను ప్రభుత్వం రూ.2 నుంచి ఏకంగా రూ.7కి పెంచింది. దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కిడ్నీ బాధితుల కోసం టీడీపీ ప్రభుత్వం మంచి పథకాన్ని తెస్తే.. వైసీపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చిందని మండి పడుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సతీ్‌షను వివరణ కోరగా నిర్వహణ వ్యయం పెరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర పెంచామన్నారు.