ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 44 మద్యం షాపుల్లో క్యాష్‌లెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగదు రహిత మద్యం కొనుగోలుకు అబార్కీశాఖ సౌకర్యం కల్పించింది. మరో వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని షాపుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లాలో 146 , పార్వతీపురం మన్యం జిల్లాలో 52 మద్యం షాపులున్నాయి. అయితే ప్రయోగాత్మకంగా తొలుత విజయనగరం జిల్లాలో 33 షాపుల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరులోని పది షాపుల్లో నగదు రహిత విధానం అమల్లోకి తెచ్చారు. నగదు రహిత విధానంలో మద్యం విక్రయడానికి సేల్స్‌మన్లు మొగ్గు చూపడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే తదితర వాటి ద్వారా స్కాన్ చేసినప్పుడు 4 నుంచి 8 నిమిషాలు సమయం పడుతోంది. దీంతో రద్దీ పెరిగిపోతుండడంతో వారు సహనం వహించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నగదు రహిత విక్రయాలు జరిగేలా ఎక్సైజ్ అధికారులు చొరవచూపాలని మందుబాబులు కోరుతున్నారు. జాప్యమైనా నగదురహిత విక్రయాలే చేస్తున్నామని కొంతమంది సేల్స్‌మేన్లు చెబుతున్నారు.