ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం భక్తలకు కీలక సూచనలు చేసింది. భక్తులు కేదార్ నాథ్ లో వాతావరణం ఎలా ఉందో తెలుసుకొని రావాలని సూచించింది. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు సైతం మే 15 వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించింది. గత రెండు రోజులుగా కేదార్ నాథ్ లో భారీగా మంచు కురుస్తుండడంతో హేమకుంద్ సాహిబ్ వెళ్లే మార్గం మూసుకుపోయింది.