ఓ సైకో ఆసుపత్రిలోకి చొరబడి బీభత్సం సృష్టించిన ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలోకి అర్థరాత్రి సమయంలో ఓ సైకో ప్రవేశించాడు. గైనిక్ వార్డులోకి ప్రవేశించి రాళ్లతో కిటికీలు ధ్వంసం చేశాడు. దీంతో వార్డులోని పేషెంట్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బంది సైకోను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం మంచానికి కట్టేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa