అచ్యుతాపురం సెజ్ కంపెనీలను వైకాపా నాయకులు లూటీ చేస్తూ నిర్వాసితులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని భాజపా నియోజకవర్గ కన్వీనర్ రాజాన సన్యాసినాయుడు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వంపై భాజపా ఛార్జిషీట్ కార్య క్రమం మంగళవారం ఇక్కడ నిర్వహించింది. అచ్యుతా పురం అనకాపల్లి రోడ్డును ఆధ్వానంగా వదిలేశార న్నారు. వైకాపా నాయకులు భూకబ్జాలు, గ్రావెల్ దందాలు నిర్వహిస్తూ జేబులు నింపుకొంటున్నారని మండిపడ్డారు. నిర్వాసితులకు, స్థానికులకు ఉపాధిలే దన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంతిన భక్త సాయిరాం, రాష్ట్ర సైనిక కన్వీనర్ ఆగ్గాల హనుమంతురావు, నాయకులు మేరుగు కాసుబాబు, గోవింద రెడ్డి రాముడు, విశ్వనాథం, దాసుబాబు పాల్గొన్నారు.