అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. అతడిని తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు ఆర్మీని ఆదేశించింది. ఆయన అరెస్టు చట్ట విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అవినీతి ఆరోపణలపై మంగళవారం పాకిస్థాన్ రేంజర్లు అతడిని అరెస్ట్ చేశారు.