రాజమండ్రిలోని టీడీపీ మహానాడు ప్రాంగణంలో శుక్రవారం భూమి పూజ ఘనంగా జరిగింది. వేమగిరి సమీపంలో ఉన్న హైవే పక్కన 100 ఎకరాల విస్తీర్ణంలో సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ భూమి పూజలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గోరంట్ల, ఆదిరెడ్డి భవానీ, కొల్లు రవీంద్ర, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడును పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.