ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ మాదిరిగా ప్రజలకి భీమా కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 12, 2023, 01:33 PM

కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకుండా వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమాను ప్రవేశపెట్టారని నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి పేర్కొన్నారు. గురువారం కోవూరు పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....  కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రన్న బీమాను ఏర్పాటు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కుటుంబ సభ్యుల అందరికీ వర్తింప చేయడంతో పాటు పరిహారాలు కూడా ఈ పథకంలో ఉన్న విధంగానే ఇవ్వాలని, అదేవిధంగా పరిహారం కూడా తక్షణమే చెల్లించాలని టీడీపీ తరపున డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఇందుపూరి మురళీకృష్ణారెడ్డి, ఇంటూరి విజయ్‌, ఉక్కెం మల్లికార్జున, ఉయ్యూరు వేణు, వేణుగోపాల్‌, ఎస్‌కే మహ్మమద్‌, పీ రాంబాబు, వాహీద్‌, నాసీర్‌, కాకి భగవాన్‌, పడవల శ్రీనివాసులు, లక్ష్మయ్య, పూల కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com