104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఆరవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 104 ను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని 104 ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న రెండు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని బఫర్ ఉద్యోగులకు బకాయి ట్రావెలింగ్ అలవెన్స్ వెంటనే చెల్లించాలని, బదిలీల సౌకర్యం కల్పించాలని మూడు నెలలకు ఒకసారి ఉద్యోగులు యాజమాన్య ప్రతినిధులతో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించాలని, ఈ డిమాండ్లతో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిష్ణ జిల్లా కోశాధికారి బి. సుబ్బారావు (డ్రైవర్ ) ఉమా(డి ఈ ఓ), ప్రదీప్ (డ్రైవర్ ) శుక్రవారం గన్నవరం మండలం లో పాల్గొన్నారు.