ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులంతా ఆనందంగా ఉన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 12:23 PM

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులు పడిన మనోవేదన, వారి క్షోభకు ఆయనతో పాటు పవన్‌కళ్యాణ్‌ ఏం సమాధానం చెబుతార‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు?. ప్రజల్లో ఏదో ఉనికి కోసం ఆరాటపడుతూ పొలిటికల్‌ టూరిస్టుల్లా బాబు, పవన్‌కళ్యాణ్‌ తపన పడటాన్ని రైతులు అర్ధం చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మేం క్షేత్రస్థాయిలో పర్యటించాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులంతా ఆనందంగా ఉన్నారు. గోనెసంచుల దగ్గర్నుంచి మద్ధతుధర వరకు ఎలాంటి సమస్యలు లేవని రైతులే చెబుతున్నారు. అయితే, ఇలాంటి మంచి వాతావరణం బాబు, పవన్‌లకు నచ్చడంలేదు. కొంతమంది టీడీపీ కార్యకర్తల్ని రైతువేషాల్లో నిలబెట్టి వారిచేత మాట్లాడించి ఈ ప్రభుత్వం మీద ఏదో బురదజల్లే ప్రయత్నాలకు వారిద్దరూ తపనపడుతున్నారనేది ప్రజలకు తెలిసిపోయింది అని మంత్రి ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa