ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్‌ కళ్యాణ్‌ అజెండా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 12:24 PM

ప్రజల ఆశీస్సులు, ఆదరణతో వచ్చే ఎన్నికల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పల్లకీ మోయడమే తన అజెండా అని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ చాటి చెప్పారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో కులాల గురించి ఆలోచించడం తప్పని, అయితే చంద్రబాబు అదే చేస్తారని ధ్వజమెత్తారు. టీడీపీకి దూరమైన కాపు సామాజిక వర్గానికి పవన్‌ కళ్యాణ్‌ను ఎరగా వేసి.. ఓట్లు రాబట్టాలని చంద్రబాబు పథకం వేస్తున్నారని ఆరోపించారు. కానీ.. ఆ పథకం చెల్లుబాటు కాదన్నారు. కులాలపరంగా ప్రజలు ఓట్లు వేయరని.. చేసిన సేవ, విశ్వసనీయత ఆధారంగానే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 స్థానాల్లో విజయం సాధించడం.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయడం, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa