ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్న ఇతర విద్యాసంస్థల్లో వారికి రిజర్వేషన్ కల్పించింది. దివ్యాంగ విద్యార్థులకు 5 శాతానికి తగ్గకుండా సీట్లు కేటాయించాలని జీవో జారీ చేసింది. వీటిలో ప్రవేశాల కోసం వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇచ్చింది. అయితే, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికే ఇవి వర్తిస్తాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa