మంగళవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు. నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తివేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ హెలెన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు విజయ యాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ విజయ యాత్రలో బుచ్చినాయుడు కండ్రిగ మండలానికి సంబంధించిన మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు, మాజీ జడ్పిటిసి సముద్రాల సుధాకర్ నాయుడుతో పాటు తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం ఉపాధ్యక్షులు భాస్కర్ యాదవ్ పాల్గొనడం జరిగింది. తప్పకుండా 2024 లో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని హెలెన్ గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.