నంద్యాల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి , అఖిల ప్రియ మధ్య వాగ్వాదం ఘటనపై టీడీపీ సీనియర్ నేతలతో అధ్యయన కమిటీ వేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువనేత నారాలోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మహా యజ్ఞంలా సాగుతోందన్నారు. వంద రోజులు పూర్తి అయిన సందర్బంగా 175 నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో సంఘీభావ పాదయాత్రలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ సమయంలో నిన్న నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.