ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి 31వ తేదీలోపు ఏపీ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి రిక్వస్ట్పై బదిలీకి అవకాశం కల్పించింది. అలాగే ఒకే చోట 5 ఏళ్లు నిండిన వారికి సాధారణ అభ్యర్థనపై బదిలీలను అనుమతించింది. ఏప్రిల్ 2023 నాటికి సర్వీసు పూర్తి చేసిన వారు దీనికి అర్హులుగా పేర్కొంది.