ఇటీవల కాలంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో వారి పిల్లలు కర్కశంగా వ్యవహరిస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఓ సుపుత్రుడు కన్నతల్లిపై దాడి చేశాడు. ఆస్తి కోసం వృద్ధురాలైన తల్లిని చితకబాదాడు. ఆమె గొంతు పట్టుకొని దాడి చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.