పుత్తూరు- చెన్నై హైవేపై నాగలాపురం బైపాస్ పక్కన ఉన్న చెల్లాతమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని గురువారం దారుణంగా నరికి చంపారు. హంతకులు హత్య చేసి పారిపోయారు. మృతుడు పిచ్చాటూరు మండలం రామగిరికి చెందిన మారిముత్తు కుమారుడు మునస్వామిగా గుర్తించారు. ఇతను గేదెల వ్యాపారం చేస్తూ ఉంటాడు. వ్యాపార లావాదేవీల కారణంగానే హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.