రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోటాగరం వైఎస్ఆర్సిపి యువ నాయకులు చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కోటాగరం పంచాయతీ సచివాలయం పరిధిలోని కోటాగరం, కోటగారం హెచ్ డబ్ల్యు , ఎట్టేరి, ఎట్టేరి హరిజనవాడ గ్రామాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లాలని ఉద్దేశంతోనే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మండల కన్వీనర్ పూర్ణ చంద్ర రెడ్డి , గుణశేఖర్ రెడ్డి , సర్పంచ్ లత , ఎంపీటీసీ నీలమ్మ, వైసిపి నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.