కేంద్ర మంత్రి వర్గ మార్పులపై ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఆయన శుక్రవారం కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ తనకు పనిష్మెంట్ ఇవ్వలేదని, ఇది కేంద్ర సర్కార్ ప్రణాళిక అని, ఈ చర్య ప్రధాని దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. తనకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నందున తాను బాధ్యతాయుతంగా పని చేస్తూనే ఉంటానన్నారు. కాగా, ఇటీవలే ఆయనకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అప్పగించారు.