వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లికి శుక్రవారం గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన ఆయన తల్లికి బాగోలేకపోవడంతో పులివెందుల వెళ్లారు. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకు రావాలని భావించారు. మార్గమధ్యంలో కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన వరుసగా రెండు సార్లు విచారణకు గైర్హాజరు కావడంపై సీబీఐ గుర్రుగా ఉంది.