పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో శనివారం సాయంత్రం పెదకూరపాడు నియోజవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి దర్శి వెంకటేశ్వరావు ప్రకటనలో తెలిపారు. పెదకూరపాడు మండలంలో జరిగే పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శాసన సభ్యులు పాల్గొంటారని ఆయన వివరించారు. అమరావతి మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.