తిరుమల శ్రీవారి ఖజానాకు గండికొట్టేలా లడ్డూలను బ్లాక్ లో విక్రయిస్తున్న వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. విరిగిపోయిన లడ్డూల పేరుతో కొన్నేళ్లుగా బ్లాక్ లో విక్రయిస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. టీటీడీ ఉద్యోగితో పాటు నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.