మధురవాడ గత గురువారం తూతూమంత్రంలా కొమ్మాది జంక్షన్ రైతుబజార్ ముఖద్వారంలో అక్రమ దుకాణాల తొలగింపు చర్యలు జరిగాయని ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు. శనివారం మరల ఒక్కసారి రైతు బజార్ కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న దుకాణాలను తొలగించారు. కొమ్మాది జంక్షన్ రైతుబజార్ కు వెళ్లే ప్రధానమార్గం, ఫుట్ పాత్లు ఆక్రమిస్తే అటువంటి వారిపై కఠినచర్యలు తప్పవని, ఫుట్ పాత్ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటివారైననా ఉపేక్షించ వద్దని తమ పై అధికారులు ఆదేశాలు ఇచ్చారని సచివాలయం ప్లానింగ్ సెక్రటరీలు తెలిపారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ దుకాణాలను తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారుల మాట వినకుండా పదే పదే రైతు బజార్ కి వెళ్ళే సేవా మార్గంలో దుకాణాలు మరల ఏర్పాటు చేస్తే తగిన చర్యలు చేపడతామని ప్లానింగ్ సెక్రటరీలు దుకాణదారులను హెచ్చరించారు.