బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల పరిధిలోని చినపులివర్రు గ్రామ సచివాలయ పరిధిలోని తాడిగిరిపాడు గ్రామంలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల తో మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిస్కారం కోసం సి. ఎం, జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మనప్రభుత్వం ప్రవేశ పెట్టారన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సర కాలంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా వివరించి అందించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ దే అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, గ్రామపంచాయతీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.