పవన్కళ్యాణ్ పాపం పసివాడు. తాను పెరగడు. మరెవరినీ ఎదగనివ్వడు. అలాంటి పవన్కళ్యాణ్.. జగన్ గారిని పాపం పసివాడు అంటున్నారు. నిజానికి పవన్కళ్యాణ్ ఒక మరుగుజ్జు. కూలీ నెంబర్.1. నోట్లో వేలేసుకుని, చంద్రబాబు చేయి పట్టుకుని తిరిగే పాపం పసివాడు పవన్ కళ్యాణే. 2014లో పార్టీ పెట్టి చంద్రబాబును సపోర్ట్ చేశావు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క అంగుళమైనా పెరిగావా?. ఉన్నకొద్దీ తగ్గిపోతున్నావు అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.