ప్రజలంతా శాంతియుతంగా మెలిగి జీవించాలని అమరావతి సీఐ ఏ. వి బ్రహ్మం అన్నారు. శనివారం రాత్రి అమరావతి మండలంలోని లింగాపురం గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు ఘర్షణకు పాల్పడకుండా స్నేహభావంతో ఉండాలని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులు సంప్రదించాలని సిఐ కోరారు. ఈ పల్లెనిద్రలో ఎస్సై కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.