వన్ టైం సెటిల్మెంట్ పేరుతో రైతుల నుంచి నగదు వసూలు చేసి బ్యాంకుకు చెల్లించకపోవడంతో గతంలో తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన జై రాములు నాయక్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. ఓఎసీ పేరుతో రైతుల నుంచి రూ. 50 లక్షలు నగదు వసూలు చేసి బ్యాంకుకు జమ చేయకపోవడంతో అధికారులు అప్పట్లో రికవరీ చేశారు. ఇంకా రూ. 8. 20 లక్షలు చెల్లించాల్సి ఉండటంతో సస్పెన్షన్ లో ఉన్న ఆయనపై కేసు నమోదు చేశారు.