ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా ఉగ్రవాదంపై పోరాడుదాం అంటూ ప్రసంగాలు చేస్తారని, ఇప్పటివరకు బీజేపీ నేతలు ఎవరూ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తరచూ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతుంటారని, కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి మద్దతు నిలిచిందని ఆరోపణలు చేస్తుంటారని చెప్పారు.