వైఎస్సార్ కంటివెలుగు పథకంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 31.77 లక్షల మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయించామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. వీరిలో 11.46 లక్షల మంది కళ్లద్దాలు అవసరముండగా 8.81 లక్షల మందికి పంపిణీ చేసినట్లు తెలిపింది. 1.86 లక్షల మందికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా, 53,416 మందికి పూర్తిచేశామని తెలిపింది. మిగతా వారికి కూడా త్వరగా ఆపరేషన్లు పూర్తిచేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.