వేసవి సెలవులు, నిన్న ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనానికి రెండున్నర నాలుగు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది. కొండ క్రింద ఉన్న బస్ బే, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతుంది.