కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మావూరి వీరమణి(21) కుటుంబుంతో కలిసి బర్మాక్యాంప్ లో నివాసముటుంది. నర్సింగ్ మొదటి సంవత్సరం పూర్తి అయింది. ఈ నెల 15న తల్లిదండ్రులతో కాలేజికి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆమె బావ కలిపి నరేంద్ర కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేసి ఏఎస్ఐ ఆదిరాజు కేసు దర్యాప్తు చేపట్టారు.